ఉండవల్లి వ్యాఖ్యలకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తెలుగుదేశం !!*
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ పై ఇప్పటివరకు పొగిడేందుకు, తిట్టేందుకు ఏమీ లేదన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇసుక విధానం, కరెంట్ కోతల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. నవరత్నాల్లో ఏ ఒక్కటి అమలు కాకపోయినా సొంతపార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఉండవల్లి పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకి మన తెలుగుదేశం అభిమాని ఘాటుగా స్పందించారు చూడండి…
కనీసం తన ఊరికి దగ్గర్లోనే బోటు మునిగి 30 మందికిపైగా చనిపోతే నోరెత్తని ఉండవల్లి.. కృత్రిమ వరదలు సృష్టించి వేల ఎకరాల పంట నీట మునిగితే అడ్రస్ లేని ఈయన… ఇసుక మాఫియా రంగంలోకి దిగి మన రాష్ట్రానికి ఇసుక అందకుండా తెలంగాణాకి అక్రమ రవాణా చేసి లక్షల మంది భవన నిర్మాణ కూలీల నోట్లో అన్నం ముద్ద తీసేస్తే స్పందించని ఈయన.. అన్న కాంటీన్లని మూసేసి లక్షల మంది పేదల కడుపు మీద కొడితే కంటికి కనిపించని ఈయన.. రోజుకి మూడున్నర ఎకరాల చొప్పున శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లని నరికి దేశాలు దాటిస్తుంటే పక్షవాతం వచ్చినట్లు పడిపోయిన ఈయన… మిగులు విద్యుత్ తో పక్క రాష్ట్రాలకి కూడా విద్యుత్ అమ్మే స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని నేడు కరెంటు కోతలతో కటకటలాడేట్లు చేస్తుంటే కళ్ళు కాకులెత్తుకుపోయినట్లు నటిస్తున్న ఈయన… ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దాదాపు మ్యాప్ లో లేకుండా చేస్తుంటే చేష్టలుడిగినట్లు చూస్తున్న ఈయన ఈరోజు తుగ్లక్ సీఎం కి తొక్కలో సలహాలు ఇవ్వడానికి మీడియా ముందుకొచ్చాడు….
ఈయనకి మీడియా ముందుకి రావడానికి సిగ్గెక్కడుందో అర్ధంకాలా… నువ్వొక మేధావివా? దేన్లో మేధావివి? లక్ష కోట్లు ప్రజాధనం దోచుకుంటే ఆ కేసుల్లోనుంచి బయటపడడానికి లాయర్ గా దొంగ సలహాలివ్వడంలో మేధావివి… లక్షల ఎకరాల పంటపొలాల్ని సాగులోకి తీసుకొచ్చిన పట్టిసీమ ఎందుకు కట్టారో అంటూ మీడియాకెక్కిన కళ్లుండి కబోదిలా నటిస్తున్న మేధావివి.. ఏం ఉపయోగం నీవల్ల రాష్ట్రానికి..?
తుగ్లక్ పరిపాలనలో రాష్ట్రం దారుణంగా నష్టపోతుంటే హైదరాబాద్ లో కూర్చుని పకోడీలు తింటూ మీడియా ముందుకొస్తావా..? అసలు పదేళ్లు ఎంపీగా రాష్ట్రానికి ఏం చేశావు..? వై.ఎస్ చేస్తున్న దారుణాలని, అక్రమాలని జాతీయ మీడియాలో వెనకేసుకురావడం తప్పించి రాష్ట్రం కోసం నువ్వు చేసిందేమైనా ఉందా..? ఇంకా నీ సొల్లు వినడానికి మీడియా వాళ్ళు వచ్చారంటే వాళ్ళెంత పనీపాటా లేకుండా గాలికి తిరుగుతున్నారో అర్ధం అవుతుంది…