దంత సంరక్షణపై పౌరులకు అవగాహన కల్పించడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఎయిమ్స్ సంస్థ సంయుక్తంగా 'ఈ-దంతసేవ' పేరుతో ఓ వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించాయి. దేశంలో ఉన్న దంత వైద్యశాలలు, కళాశాలలు, చికిత్స కేంద్రాలు తదితర వివరాలను ఈ అప్లికేషన్‌లో పొందుపరిచారు. దంత చికిత్సాలయాలకు ప్రజలు సులభంగా చేరుకోవడానికి వెబ్‌సైట్‌లో జీపీఆర్‌ఎస్ సర్వీసును ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. నోరు, దంత సమస్యలకు సంబంధించి ప్రజలకు చక్కని సలహాలు అందించడానికి ఈ అప్లికేషన్ సాయపడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
ఈ-దంతసేవ’ మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరణ