ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ హత్య అత్యంత హేయం 

 


ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ హత్య అత్యంత హేయం 


- ప్రత్తిపాడు ప్రెస్ క్లబ్ ఖండన 


- నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి 


తొండంగి ఆంధ్రజ్యోతి అర్బన్ విలేకరి, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కాతా సత్యనారాయణ హత్య దిగ్బ్రాంతికి గురిచేసింది.ఈ చర్యను  ప్రత్తిపాడు ప్రింట్ ఎలక్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ బృందం  ఖండిస్తూన్నాము. 
పోలీస్ లు తక్షణం గుర్తించి అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్స్ సంఘ నాయకులుబీశెట్టి నందు బాబు,ఆడారి శ్రీధర్ లు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వాదులంతా జర్నలిస్ట్ సత్యనారాయణ హత్యను ఖండించాలని పిలుపునిస్తున్నాం. సత్తిబాబు మృతి వార్తలు రాసే పాత్రికేయ లోకాన్ని కలచివేస్తోంది. ఈ దారుణసంఘటన చాలా బాధాకరం .నిందితులను కఠినంగా శిక్షించాలి.హత్యల ద్వారా పాత్రికేయుల గొంతు నొక్కాలని చూస్తే మరింత పట్టుదలతో పాత్రికేయులు ప్రజాస్వామ్యంలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చుతూ ముందుకు సాగుతారని స్పష్టం చేస్తున్నాం. సత్తిబాబు కుటుంబానికి ప్రత్తిపాడు ప్రెస్క్లబ్ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.ఆయన ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాము.కార్యక్రమంలో,కొత్తూరు బాబూరావు, సోర్నపూడి సోమేశ్వరరావు, పెంటకోట సాయి,ప్రగడ రామకృష్ణ