పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు మాజీ ఎండీ జోయ్ థామస్‌కు ముంబయి అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ న్యాయమూర్తి అక్టోబర్ 17 వరకు కస్టడీ విధించారు. కాగా ఎలాంటి నిర్ణయాధికారం లేని థామస్‌ను ఈ కేసులో బలిపశువుగా మారుస్తున్నారని అతడి తరఫు న్యాయవాది రాకేశ్ సింగ్ వాదించారు. అతడు కేవలం బ్యాంకులో ఉద్యోగి మాత్రమేనన్నారు. పీఎంసీ బ్యాంకులో జరిగిన రూ.4,355 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ముంబయి పోలీసు ఆర్థిక నేరాల శాఖ (ఈఓడబ్ల్యూ) థామస్‌ను శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆయనను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
పీఎంసీ బ్యాంకులో జరిగిన రూ.4,355 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉందన్న