సైనికులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం....??*
*జమ్మూకాశ్మీర్‌లోని* బారాముల్లాలో క్వాజాబాగ్ ప్రాంతంలో ఉన్న ATM లోకి ప్రతిరోజూ 24 ఏళ్ళ వయసున్న ఒక యువ సైనికుడు వచ్చి 100/- మాత్రమే డ్రా చేసి వెళ్ళేవాడు..
ఇలా ప్రతిరోజూ అతను 100/- మాత్రమే డ్రా చేసేవాడు..
అక్కడ కాపలా ఉన్న వాచ్‌మెన్‌కు అతను అలా 100/- మాత్రమే ప్రతిరోజూ ఎందుకు విత్‌డ్రా చేస్తున్నాడో తెలియక జుట్టు పీక్కునేవాడు..
ఒక రోజు ధైర్యం చేసి ఇలా అడిగాడు: "నువ్వు 100/- మాత్రమే రోజూ ఎందుకు విత్‌డ్రా చేస్తావు..
నేను నా జీవితంలో కొన్ని లక్షల మందిని డబ్బులు డ్రా చేసేవాళ్ళను చూచాను..
నీ లాగా ఇలా రోజూ 100/- మాత్రమే డ్రా చేసి సమయం వ్రృధా చేసుకునే పిచ్చి వారిని చూడలేదు.."
దానికి ఆ యువ సైనికుడు చెప్పిన సమాధానం:
*నాకు ఇటీవలే వివాహమైంది*, ఈ కల్లోల జమ్మూకాశ్మీర్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా మా సైనికులు ఇంట్లో వారితో ప్రతిరోజూ మాట్లాడడానికి అవకాశం లేదు..
నేను డబ్బులు డ్రా చేస్తే, నా *బ్యాంకు అకౌంటుకు లింక్ అయిన ఫోన్ నంబరుకు మెస్సేజ్ పోతుంది*..
ఆ ఫోన్ నా భార్య చేతిలో ఉంటుంది..
*ఆ మెస్సేజ్ కోసమే ఆమె వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది*..
నేను బ్రతికున్నానని అదే మా ఇంట్లో వారికి గుర్తు..
వరుసగా రెండు రోజులు మెస్సేజ్ రాకపోతే, నేను *భరతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయానని వారికి తెలుస్తుంది*.." అని సమాధానం చెప్పాడు..
*ఈ సమాధానం విన్న ఆ ATM వాచ్‌మెన్‌కు ధారాపాతంగా కంటి నీరు ఆగలేదు....*