విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగం కావాలి  -ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

 


విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగం కావాలి                                     *ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు*           .. విద్యార్థి దశ నుండే దేశభక్తిని ఆలవరచు కొని, దేశాభివృద్ధిలో లో భాగం అవ్వాలని నరసరావుపేట పార్లిమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యార్థులకు సూచించారు. మంగళవారం చిలకలూరపేట.. మద్దిరాల  గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయం లో నిర్వహించిన ' రీజనల్ లెవెల్ యూత్ పార్లిమెంట్ కాంటెస్ట్ - 2019 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ  పాల్గొన్నారు. ఎంపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల ఆలోచన శక్తి అమోఘం అన్నారు. వారే రేపటి భవిష్యత్ నిర్ణేతలు అని అన్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న జ్ఞానాన్ని, ఆలోచనలు తోటి వారితో పంచుకోవాలని సూచించారు. నాలుగు గోడల తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను ప్రయోగాలు గా మార్చాలి. జ్ఞాన సముపార్జనకు ఉపకరించే డెబిట్ లు, చర్చలలో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొనాలి. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం శ్రీకృష్ణదేవరాయలు ని శాలువాతో సత్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన పార్లిమెంట్ నమూనా డ్రామా ని ఎంపీ వీక్షించారు.