ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్ రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్ లావణ్య, వరంగల్ జేడీ కార్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగి పాషాను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ. 28 కోట్ల మందుల కొనుగోళ్ల అవకతవకలకు రాజేశ్వర్‌రెడ్డి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ ముగ్గురు పెద్దమొత్తంలో ఈఎస్‌ఐ మందులను ప్రయివేటు ఆస్పత్రులకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 16కు చేరింది.
ఈఎస్‌ఐ కుంభకోణం కొనసాగుతున్న అరెస్టులు