రూ 20000 విలువైన 10 కేజీలు గంజాయ్ స్వాధీనం - వ్యక్తి అరెస్టు

రూ 20000 విలువైన 10 కేజీలు గంజాయ్ స్వాధీనం - వ్యక్తి అరెస్టు
రాజవొమ్మంగి, 



20 కేజీల గంజాయితో వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు స్థానిక సిఐ నాగ దుర్గారావు తెలిపారు. ముందస్తు సమాచారం ప్రకారం మంగళవారం నాడు మధ్యాహ్నం గ్రామ శివారు న పోలీసు తనిఖీలు నిర్వహిస్తుండగా తెల్ల సంచి పట్టుకొని వ్యక్తి అనుమానస్పదంగా సంచరిస్తుంటే పట్టుకొని తనిఖీ చేయగా తెల్ల సంచి మూటలో 10 కేజీలు గంజాయ్ వెలుగులోకి వచ్చింది నిందితుడు విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి కి చెందిన సాగిన భాగ్యరాజు. ఈ మేరకు డిప్యూటీ తాసిల్దారు సత్యనారాయణ, విఆర్వో భారతి లతో పంచనామ నిర్వహించి ముద్దాయిని అదుపులోకి తీసుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో ఎస్ఐ వినోద్ సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై వినోద్ తెలిపారు.