4 రోజుల పాటు రాష్ట్రంలో కారెం శివాజీ గారి పర్యటన
ఆంధ్రప్రదేశ్ యస్సీ..యస్టీ కమిషన్ చైర్మన్ కారెం.శివాజీ రాష్ట్రం లో తూర్పుగోదావరి-చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
పర్యటన వివరాలు...
6.9.2019 శుక్రవారం ఉదయం 9 గంటలకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామం చేరుకుంటారు.మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అయినవిల్లి మండలంలో స్థానిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
రాత్రికి మాగం లోనే బస చేస్తారు.
7.9.2019 శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామంలో స్థానికంగా అందుబాటు
లో ఉంటారు.
రాత్రికి మాగం లో బస చేస్తారు.
8.9.2019 ఆదివారం తెల్లవారు
జామున 4 గంటలకు మాగం నుంచి
రోడ్డు మార్గంలో బయలుదేరి 5 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు.5:30 గంటలకు హంసఫర్ ఎక్స్ ప్రెస్ లో తిరుపతి బయలుదేరి, మధ్యాహ్నం 2:10
గంటలకు తిరుపతి చేరుకుంటారు.
3 గంటలకు రోడ్డు మార్గంలో తిరుపతి నుంచి బయలుదేరి తిరుమల చేరుకుంటారు.తిరుమల లోనే రాత్రిబస చేస్తారు.
9.9.2019 సోమవారం ఉదయం 6 గంటలకు తిరుమలలో స్వామివారిని వి.ఐ.పి
బ్రేక్ దర్శనం లో దర్శించుకుంటారు.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ తిరుపతి సబ్ కలెక్టర్ తో ప్రత్యేకంగా సమావేశమవుతారు
12:15 గంటలకు తిరుపతి నుంచి బి.బి.యస్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి రాత్రి 8:30 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు.రైల్వేస్టేషన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 9:30 గంటలకు మాగం చేరుకుని రాత్రి బస చేస్తారు.......
10.9.2019 మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ
జిల్లాలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు.రాత్రి కి మాగం లోనే బస చేస్తారు..........
11.9.2019 బుధవారం ఉదయం 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా మాగం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11 గంటలకు విజయవాడలో కమిషన్ కార్యాలయానికి చేరుకుంటారు.