శ్రీ మేకా రమేష్ గారు శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళము రూ.1,00,116/-


 హైదరాబాద్, మియాపూర్ వాస్తవ్యులు శ్రీ మేకా రమేష్ గారు  వారి మిత్రులతో  కలిసి ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.1,00,116/- లను కార్యనిర్వహణాధికారి వారికి అందజేసినారు. ప్రధాన అర్చకులు ఆధ్వర్యములో వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రముతో సత్కరించి, తీర్ధ ప్రసాదములను అందజేసినారు.  కార్యనిర్వహణాధికారి వారు వీరిని ప్రత్యేకముగా అభినందించి శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు.