ఘనంగా నల్లా పుట్టినరోజు వేడుకలు


ఘనంగా నల్లా పుట్టినరోజు వేడుకలు


(తూర్పుగోదావరి-జి ఎన్ రావ్ )



అమలాపురం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక మాచిరాజు వీధిలోని ఆయన స్వగృహం వద్ద బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో బర్త్‌ డే కేక్‌లను నల్లా కట్‌ చేసారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం స్థానిక సుభాష్‌చంద్రబోస్‌ మున్సిపల్‌ స్కూల్‌లోని విద్యార్థులకు రూ.25వేలు విలువైన స్కూల్‌ బ్యాగ్‌లు, స్వీట్లు పంచారు. స్థానిక బుద్దాల బ్లడ్‌ బ్యాంకు వద్ద బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి గనిశెట్టి అరవింద్‌ ఆధ్వర్యంలో అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి కృష్ణసుందర్‌, మజ్దూర్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆకుల వీరబాబు ఆధ్వర్యంలో లూయి అంధుల పాఠశాలలోని చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, ఛాంబర్‌ ఆఫ్‌ అధ్యక్షులు గోకరకొండ హరిబాబు, కోనసీమ ఫెడరేషన్‌ అధ్యక్షులు సలాది నాగేశ్వరరావు, బులియన్‌ మర్చంట్స్‌ ప్రతినిధి రేకపల్లి సూరిబాబు, బోణం సత్యవరప్రసాద్‌, బీజేస్సీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొల్లి సూర్యారావు, మాజీ సర్పంచ్‌లు, కొపనాతి శ్రీరామచంద్రమూర్తి, చీకురుమెల్లి వెంకటేశ్వరరావు, కోనసీమ జేఏసీ నాయకులు బండారు రామ్మోహనరావు, కరాటం ప్రవీణ్‌, స్వీట్స్‌ అండ్‌ బేకరీ అసోసియేషన్‌ అధ్యక్షులు నల్లా మల్లిబాబు, ఎబివిపి జిల్లా అధ్యక్షులు అంజిబాబు,కరచిపల్లి అబ్బులు, పత్తి దత్తుడు, నల్లా చిట్టిబాబు, యేడిద దొరబాబు, కాటా బాలయ్య, దేవాదుల సూర్యనారాయణ, అయ్యల బాషా, పెద్దిరెడ్డి రాంబాబు, మొసలి శ్రీను, వంకాయల వీరభద్రరావు, నారాయణశెట్టి రాజేష్‌, నామన మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.