గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై


గణపతి నవరాత్రి మహోత్సవములు నాల్గవ  రోజున వెండి మూషిక వాహనము పై  నాలుగు మాడ వీదులు నందు  శ్రీ స్వామి వారి పల్లకి సేవ జరిగినది.  ఈ సేవ ఉత్సవంలో సిద్ధి వినాయక భజన మండలి, సిరిపల్లి వారి కోలాట  బృందం పాల్గొన్నారు. భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారిని ధర్శించినారు. అనంతరం ఆలయములో శ్రీ స్వామి వారి పంచహారతి  పూజా కార్యక్రమములను తిలకించి, తీర్ధ ప్రసాదములను స్వీకరించినారు. ఆలయ కార్యనిర్వహణాధికారి  ఉత్సవ అధికారి వార్లు  ఆలయ అర్చకులు  మరియు సిబ్బంది పాల్గొనినారు.