ఆర్టీఐ చట్టం నీరుగారు తున్నదా

 


తెలంగాణలో ఆర్టీఐ చట్టం నీరుగారిపోతుందా...?
అవుననే అనవచ్చు.


సమాచారహక్కు చట్టం ధ్యార ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి పాలనను అంతమొందించి పారదర్శకత పాలనను తీసుకురావాలని 2005 లో సమాచారహాక్కు చట్టాన్ని రూపొందించారు. కానీ దానికి విరుద్ధంగా తెలంగాణ స్టేట్ కమిషన్ వెవహరిస్తుందని ఫిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో పిఐఓ అధికారులకు సమాచారం కోరగా 30 రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని 30 రోజుల తరువాత సదరు అధికారి అయిన అప్పీలెట్ అధికారికి సమాచారం కోరగా నిమ్మకు నీరెత్తినట్టు వెవహరిస్తుండడంతో తెలంగాణ స్టేట్ కమిషన్ కి ఫిర్యాదు చేయగా  అధికాస్త స్టేట్ కమిషన్ దృష్టికి రావడానికి 2,3 సంవత్సరాలు పడుతుంది. సదరు ఫిర్యాదు దారునికి స్టేట్ కమిషన్ వెంటనే పిఐఓ,అప్పిలేట్ అధికారి దగ్గరనుంచి ఫిర్యాదు దారునికి సమాచారం ఇప్పించకుండా పిఐఓ,అప్పిలేట్ అధికారులకు మరో వారం టైం కేటాయిస్తూ అధికారులకు సహకరిస్తూ న్యాయం కోసం వందల కిలోమీటర్ల నుండి వచ్చిన ఫిర్యాదు దారులకు తీరని అన్యాయం చేస్తున్నారని నిరాశతో తిరుగు ప్రయాణం అవుతున్నారని వ్యాపోతున్నారు .
దీనిపై వెంటనే కేంద్ర ఆర్టీఐ కమిషన్,హైకోర్ట్ స్పందించి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.