బీజేపీ అధికారదాహానికి బలైపోతున్న చంద్రబాబు
సెహబాష్ చంద్రబాబు... మొన్ననే నలుగురు వేలకోట్లకు అధిపతులైన రాజ్యసభ సభ్యులను. మరికొందరు ప్రముఖ నాయకులను బీజేపీలోకి పంపించేసి, కేసులనుంచి, దర్యాప్తులనుంచి రక్షణ కోరుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ వారి దాహం తీరకపోవడంతో తాజాగా తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని బీజేపీలోకి పంపించడానికి రంగం సిద్ధం చేశారు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు, తెలుగుదేశం మహారాజపోషకుల్లో ప్రముఖుడు, అన్నింటిని మించి "అస్మదీయ సామాజికవర్గం" వాడు అయినట్టి గరికపాటి మోహనరావు తెలంగాణలోని తన అనుచరులందరిని మరో వారం రోజుల్లో అమిత్ శా సమక్షంలో బీజేపీలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణాలో తెలుగుదేశం మొత్తం భూస్థాపితం అవుతుంది. మిగిలిన అరాకొరా నాయకులందరూ మరో అయిదారు నెలలలోగా కాషాయ కండువాలు కప్పుకోనున్నారు.
తెలుగుదేశం పార్టీకి ఇంతటి దుర్గతి ఎందుకు సంభవించింది? దానివెనుక పెద్ద హరికథే ఉన్నది. వాస్తవానికి చంద్రబాబు బీజేపీతో సంబంధాలను తెంచుకున్న తరువాత కూడా బీజేపీ నాయకత్వం (అనగా మోడీ, అమిత్ శాలు) చంద్రబాబు గారి మీద చాలా నమ్మకాన్నే కలిగి ఉన్నారు. ఎందుకంటే 2019 ఎన్నికలలో కూడా చంద్రబాబే మళ్ళీ అధికారంలోకి వస్తారని, తెలుగుదేశం తోడు లేకపోతె తమకు ఆంధ్రప్రదేశ్ లో డిపాజిట్లు కూడా రావని వారి అభిప్రాయం. అది కూడా నిజమే అని మొన్నటి ఎన్నికల్లో రుజువైంది...అది వేరే సంగతి అనుకోండి. అందుకని చంద్రబాబుతో పొత్తు కోసం ఎన్నికలకు ఆరు నెలల ముందు కూడా బీజేపీ తహతహలాడింది. చంద్రబాబుకు అనేక ఆశలు పెట్టింది. అయితే చంద్రబాబు మాత్రం మళ్ళీ ఎన్నికల్లో తమ ప్రభుత్వమే వస్తుందని, మోడీ కచ్చితంగా ఓడిపోతారని, మోడీ అంతు చూస్తామని, తమ తోడు లోకపోతే బీజేపీకి నూకలు ఉండవని, ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో తాను పర్యటించి ఒక్క పిలుపు ఇస్తే, బీజేపీ నామరూపాలు లేకుండా పోతుందనే ఒక చిత్తభ్రమలో జీవించాడు. కొన్ని కులగజ్జి పచ్చ ఛానెల్స్ కూడా చంద్రబాబును వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు అజేయుడు అనే వెఱ్ఱిభ్రమల్లో విహరించేట్లు చేశాయి. చివరకు ఒక దశలో ఒక ఛానెల్లో చర్చలో పాల్గొన్న నాటి తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ "అమిత్ శా ఇంట్లో రాత్రిపూట ఏమి జరుగుతున్నదో సీడీలు బయటపెట్టాలా?" అని బెదిరింపులకు కూడా దిగాడు. కొన్నాళ్ల తరువాత అమిత్ శా "అలాంటి సీడీలు నాదగ్గర వందలు ఉన్నాయి. దమ్ముంటే బయటపెట్టండి. నా వెంట్రుక కూడా పీకలేరు." అని కౌంటర్ ఇచ్చారట. దాంతో తెలుగుదేశం నాయకులు బిక్కచచ్చి పోయారు. అయినప్పటికీ, చంద్రబాబు మాత్రం బీజేపీకి గుణపాఠం చెప్పాలనే పట్టుదలతో "మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తాను" అని వాక్రుచ్చాడు. ఆ తరువాత అమిత్ శా కూడా "చంద్రబాబు గారు...మళ్ళీ రాబోయేది మా ప్రభుత్వమే...నేను హోమ్ మంత్రిని అవుతాను. అప్పుడు మీ సంగతి చూస్తాను" అని హెచ్చరించినట్లు సమాచారం.
అయినప్పటికీ, నెత్తిమీద అప్పటికే బలంగా శనిదేవుడు తిష్టవేసుకుని కూర్చోవడంతో చంద్రబాబుకు ఆ హెచ్చరికలు చెవికెక్కలేదు. దాంతో చంద్రబాబును, ఆయనకు ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న ఉగ్రవాదులను అష్టదిగ్బంధనం చేసే వ్యూహానికి బీజేపీ సమాయత్తమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక చంద్రబాబు దిమ్మతిరిగిపోయింది. చంద్రబాబుకు కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే రావడం దిగ్భ్రాంతికి గురి చేసింది. మళ్ళీ అధికారానికి రావడంతో బీజేపీ చంద్రబాబు భరతం పట్టడం మొదలు పెట్టింది. చంద్రబాబును తిరిగి కోలుకోకుండా దెబ్బ తియ్యడమే లక్ష్యంగా మోడీ-శా ద్వయం చర్యలు చేపట్టింది. ఫలితమే...తెలుగుదేశం మొత్తాన్ని బీజేపీలో నిమజ్జనం చేస్తే వదిలేస్తాం...లేకపోతె కేసులను గెలికి జైలుకు పంపిస్తాం" అని హెచ్చరికలు జారీ చేసిందని అంటున్నారు. ఈ వయసులో జైలుకు వెళ్లడం కలలో కూడా ఊహించలేని చంద్రబాబు పూర్తిగా చేతులు ఎత్తేసి, మోడీ చరణ"కమలాలను" ఆశ్రయించాడు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అనే సామెతను పదేపదే గుర్తు చేసుకుంటున్నాడు.