తెలుగుదేశం పార్టీ ని పార్టీ జెండాని ఎవ్వరు ఏమి  చేయలేరు

 


ఈరోజు ఉదయం గ్రేటర్ హైదరాబాద్ నాయకుల. కార్యకర్తల సమావేశం జరిగింది,ఈ సమావేశానికి ముఖ్య అథితి గా పోలిటి బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు,అతిధులుగా సాయిబాబా గారు,అరవింద్ కుమార్ గౌడ్ గారు,మఱియు టి ఎన్ టి యు సి,


యం కె బోస్ గారు పాల్గొన్నారు. సమావేశంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ నుండి పేరు పెరు సంపాదించుకొని వెళ్లి పోయినా ఇంకా ఎంతో మంది నిజమైన తెలుగుదేశం పార్టీ  నాయకులు, కార్యకర్తలు  ఉన్నారని,ఈ నిజమైన కార్యకర్తల ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ని పార్టీ జెండాని ఎవ్వరు ఏమి  చేయలేరని,ఈ సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలే నిదర్శనమని తెలిపారు, తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు  ఇస్తానని చెప్పి,ఇచ్చిన హామీల ప్రకారం ఇవ్వలేక ఈ ప్రభుత్వం విఫలమైందని,అందుకని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నేల 26 వ తారీకు ఉదయం 9:30 గం౹౹ ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి పార్టీ నిర్ణయించింది అని చెప్పారు,ఈ ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు, ఈ సమావేశంలో  తెలుగు దేశం పార్టీ మరియు,టి ఎన్ టి యు సి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.