అహ్మద్ ఖాన్ హతం

అహ్మద్ ఖాన్ హతం..


కొన్నినెలల క్రితం భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే అభినందన్ విమానం పీఓకేలో కూలిన సమయంలో అహ్మద్ ఖాన్ అనే కమాండో పాకిస్థాన్ లో హీరో అయ్యాడు. పాకిస్థాన్ సైన్యంలో స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండోగా విదులు నిర్వర్తిస్తున్న అహ్మద్ ఖాన్ తమ భూభాగంలో అడుగిడిన అభినందన్ను పట్టుకున్నాడు. దాంతో పాకిస్థాన్లో అహ్మద్ ఖాన్ కు నీరాజనాలు పలికారు. ఇప్పుడా అహ్మద్ ఖాన్ను భారత సైన్యం అంతమొందించింది. ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు ప్రయత్నించే క్రమంలో అహ్మద్ ఖాన్ హతమైనట్ల రక్షణ వర్గాలు వెల్లడించాయి.