జనసేన ఎమ్మెల్యే రాపాక‌ వరప్రసాద్‌పై కేసు

 


తూర్పు గోదావరి : జనసేన ఎమ్మెల్యే రాపాక‌ వరప్రసాద్‌పై మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు సమాచారం. వివరాలు.. పేకాట ఆడుతున్న రాపాక అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావుకు ఎమ్మెల్యే రాపాకకు మధ్య వివాదం మొదలైంది. ఎమ్మెల్యేకు మద్దతుగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.