విలేకర్ల రక్షణే లక్ష్యం...
జాప్ రాష్ట్ర అధ్యక్షులు యం డి వి యస్ ఆర్ పున్నo రాజు
యూనియన్ అభివృద్ధికి కార్యాచరణతో ముందడుగు వేయాలని జాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యం డి వి యస్ ఆర్ పున్నo రాజు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ నగరంలో గల బందరు రోడ్డులోని సన్ ఫ్లవర్ న్యూస్ దినపత్రిక కార్యాలయం వద్ద నిర్వహించిన రాష్ట్రస్థాయి యూనియన్ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్ట్ యూనియన్ లు విలేకరుల రక్షణ ప్రధాన లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ను బలోపేతం చేసేందుకు ప్రతి సభ్యుడు కంకణబద్ధులై క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్నారు. గడచిన 25 సంవత్సరాలుగా యూనియన్ కొనసాగిన తీరు, ప్రస్తుత సమాజంలో యూనియన్ పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాల వారీగా యూనియన్ అభివృద్ధిపై సభ్యులకు సలహాలు సూచనలు అందించారు. యూనియన్ జనరల్ సెక్రెటరీ యం యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విలేకరుల కష్టసుఖాల పై సమీక్షించారు. చిన్న పత్రికల విలేకరులను సైతం సముచితంగా గౌరవించాలన్నారు. ఇదే విషయమై వివిధ శాఖల ప్రభుత్వ అధికారులకు విన్నవించటం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు స్పందించి విలేకరుల సంక్షేమం, సంరక్షణ, అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లాల వారీగా నిర్వహించాల్సిన సమావేశాలు, నూతన కమిటీ లపై త్వరలోనే కార్యాచరణ తో కూడిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. అంతకుముందు సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస రావు లను మర్యాదపూర్వకంగా కలసి విలేకరులకు సంబంధించిన భీమ, అక్రిడిటేషన్, ఇతర సమస్యలపై వినతి పత్రం ఈ సమస్యలపై వారు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో యూనియన్ కోశాధికారి ఏడుకొండలు, క్రమశిక్షణా సంఘం చైర్మన్ డి వెంక రెడ్డి, యూనియన్ ట్రస్ట్ చైర్మన్ సుభాష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ శివకుమార్, యూనియన్ వ్యవస్థాపక సీనియర్ సభ్యులు కృష్ణారెడ్డి, రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి విచ్చేసిన యూనియన్ క్రియాశీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.