పారిశ్రామిక అభివృద్ధి పది శాతం !

పారిశ్రామిక వృద్ధి పదిశాతం ఉందని చంద్రబాబు ప్రభుత్వం అబద్ధం చెప్పింది.


అసలు ఏపీలో పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు పెట్టలేదు అని బుగ్గన భలే తీర్మానించారు. అలా ఎలా చెబుతారూ అంటే ఆయన లాజిక్కు  బయట పెట్టారు. నంబర్లు చూపించో, లేదంటే ఉత్పాదకత ఏముంది ఎక్కడుంది అనో లేదంటే పెట్టుబడులు రాలేదు అనో ఆధారాలతో వివరించడం కాదు సుమా ! పరిశ్రమలు వచ్చి ఉంటే కరెంటు వాడాలి కదా ! గత ఐదేళ్లలో కరెంటు వాడకం పెరగలేదనే వాదన తెర మీదకి తెచ్చారు. నోరు తెరిచిన వాళ్లు మూసుకోవడం మర్చిపోయారు చాలా సేపు. 


బుగ్గన గారికి పవర్ గ్రిడ్  వాళ్ళ సథరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ డేటా నెట్ లో దొరుకుతుంది అని తెలియదేమో 


నేను బుగ్గన గారు వైట్ పేపర్ రిలీజ్ చేసిన రోజు 10 జులై డేటా తీసుకున్నాను 


10th జులై 2019 న ఏపీ అత్యధిక  డిమాండ్ 7175 mw , 10th  july 2015 న ఏపీ అత్యధిక  డిమాండ్ 5463 mw. రాష్ట్ర విభజన అయ్యినవెంటనే డేటా కరెక్ట్ గా ఉండదు అని 2014 డేటా కాకుండా 2015 డేటా తీసుకున్నాను. 


అంటే నాలుగు ఏళ్లలో ఏపీ పవర్ డిమాండ్ 32 % పెరిగింది , కింద వున్న టేబుల్స్ చూస్తే తెలంగాణ పవర్ డిమాండ్ఇదే టైం లో 26 % పెరిగింది. మిగతా రాష్ట్రాల పవర్ డిమాండ్ 10 % లోపలే పెరిగింది. 


ఇదే టైం లో ఏపీ ట్రాన్స్మిషన్  లాస్ 5 % దాకా తగ్గించుకొంది .. ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డులన్నీ ఏపీ వె .. led లైట్లు ద్వారా విద్యుత్ పొదుపు చేసాము.