అమరావతిని కదిలించొద్దు!
భాజపా అధ్యక్షుడు కన్నాకు రైతుల విజ్ఞప్తి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చేస్తారంటూ పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతరైతులు భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు.
గత ప్రభుత్వం అడిగితేనే తమ భూములు ఇచ్చామని, ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు.
రాజధానిలో పనులు పూర్తిగా ఆగిపోయాయని, భూములిచ్చిన రైతులకు ఇప్పుడు కౌలు కూడా ఇవ్వడం లేదని ఆయన దగ్గర వాపోయారు.
సీఆర్‌డీఏ అధికారులను కలిసినప్పటికీ వాళ్లు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని కన్నా దృష్టికి తీసుకెళ్లారు.
రాజధాని అమరావతిని మార్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.