సీఎం జగన్ చెబుతున్న మాటలకు పొంతన లేదు .

 


 


పశ్చిమగోదావరి: సీఎం జగన్ చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఎక్కడా పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో జగన్ ఒక్కసారి కూడా పర్యటించలేదన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతున్న సమయంలో రెండు సార్లు పొత్తు పెట్టుకుని చంద్రబాబు తమ పార్టీని దెబ్బతీశారని వ్యాఖ్యానించారు.  తాడేపల్లిలో గోవులు సామూహికంగా చనిపోవడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అవసరమైతే ఉద్యమం చేస్తామని కన్నా తెలిపారు. పంట మంపునకు గురైన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.