ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలిగారా ?
అవుననే అంటున్నారు ఆయన ఆంతరంగికులు.
పేరుకి ఎంతో ప్రాధాన్యత కలిగిన శాఖని తనకి అప్పజెప్పినా, పోలవరం, తెలంగాణా మీదుగా శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు వంటి కీలకమైన విషయాల్లో తనని సంప్రదించకపోగా, విధాన నిర్ణయాలన్నీ ఒకే సామాజికవర్గానికి చెందిన సిఎం గారి ఆంతరంగిక మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని, పత్రికల్లో చూస్తే తప్ప తనకి అవి తెలియట్లేదని మంత్రిగారు వాపోతున్నారట.
ఆఖరికి పోలవరం రివర్స్ టెండరింగ్ ఎందుకు సహేతుకమో ప్రధానిని కలిసి వివరించడానికి సిఎం గారితో పాటుగా ఈరోజు దిల్లీ వెళ్ళే మంత్రుల జట్టులో ఇరిగేషన్ శాఖామాత్యుడైన తన పేరే లేకపోవడం, వెళ్తున్న జట్టులో అందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు ఉండడం తనకి అవమానకరంగా ఉందని మంత్రిగారు సన్నిహితులవద్ద మథనపడ్డారని భోగట్టా.
ఒక బీసీ మంత్రిని ఇలా అవమానిస్తారా అని మండిపడుతున్నారని వార్తలొస్తున్నాయి.