టీడీపీ లో ఓవర్ కాంఫిడెన్స్ కొంపముంచుతుంది

 


టీడీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్  ఓవర్ గా కనిపిస్తోంది.


జగన్ ఫెయిల్ అయిపోయాడు కాబట్టి మనకి తిరుగులేదు అనుకుంటోంది. ఇద్దరున్న క్లాసులో ఒకడు ఫెయిల్ అయితే - యావరేజ్ *మార్కులు వచ్చిన వాడు క్లాస్ ఫస్ట్ వచ్చినట్టుగా ఉంటాయ్ ఇలాంటి యవ్వారాలు. కానీ ఇప్పుడు అలా లేదు. క్లాసులో జాయిన్ *అయ్యేందుకు కొత్తగా మరొకడు బ్యాగ్ వేసుకొని రెడీ అవుతున్నాడు. అది అర్థం చేసుకోవాలి. పైపెచ్చు ఇంకో మాట ఉంది. టీడీపీ *వాళ్ల ఫేస్ బుక్ వాల్స్  చూడండి అర్థం అవుతాయ్ కామెంట్లు - ఓటు వేశారుగా ఏడవండి లాంటి కామెంట్లు *పడుతున్నాయ్. చాలా పెద్ద తప్పు ఇది. అనాల్సిన మాట కాదు ఇది. వైసీపీకి పడిన 50 ఓట్లలో పది *ఓట్లు టీడీపీ వాళ్లవే. మళ్లీ అవి వెనక్కి తెచ్చుకోవడం ఎలా అనే దాని మీద దృష్టి ఉండాలి తప్పితే, ఆల్రెడీ కాలినోడికి దూల తీరిందా అనే పలకరింపు ఎదురు *కాకూడదు. కాలిన చోట బర్నాలో వెన్నపూసో రాయాలి వీలైతే. లేదంటే ఊరుకోవాలి. ఇంకో మాట. ఎంత సేపూ చంద్రబాబును పొగిడేందుకు సాహో ఆహో అనేందుకు టీడీపీ తీవ్ర *ప్రయాస పడుతోంది. చంద్రబాబు కొంప మునిగితే ఏంటి ? మునగకపోతే ఏంటి ? డ్రోన్ పంపడం తప్పే. కానీ ఎంత వరకూ చెప్పాలో అంత వరకూ చెప్పి ఊరుకోవాలి. *కానీ అదే ప్రపంచ సమస్య  అన్నట్టు చిత్రీకరించడం వల్ల టీవీలు చూపిస్తాయ్ కానీ టీడీపీకి ఉపయోగం లేదు. అదే ఎన్టీఆర్ కేంటీన్ల మీద, అన్న కేంటీన్ల మీద రగిలిన పోరాటాన్ని పార్టీ *భుజనా వేసుకొని ముందుకు తీసుకువెళితే ఎంత బావుండేది ? పేదోడి ఆకలికి ప్రతిపక్షం తోడు అన్నట్టుగా ఉండేది. గవర్నర్ ను కలిసి వినతి పత్రం కూడా ఇదే పాయింట్ మీద ఇవ్వాల్సింది. అన్న *కేంటీన్లు మూసేయడం వల్ల పేదోళ్లు మలమల మాడిపోతున్నారు అని చెప్పాల్సింది. డేటా తీసి - ఇదిగో ఇంత మంది అన్నం తింటున్నారు. వాళ్లకి పట్టెడు బువ్వ  అందేలా *చూడండి అని చెప్పాల్సింది. అద్దిరిపోయేది. అయినా టీడీపీకి కళ్లు ఇప్పటికీ తెరుచుకోలేదు. *అమరావతిలో ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందంటే మిగతా ప్రాంతాలకి ఎక్కడో చిన్న డిటాచ్ మెంటు. నగ్న సత్వం ఇది. ఒప్పుకోవాలి. *పైపెచ్చు టీడీపీ వాళ్లు తమ ఉనికి కోసం పోరాడుతున్నారు అనే ముద్ర కూడా ఇక్కడే పడుతోంది. మరి ఇలాంటివి ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఎలా ?*


*చంద్రబాబు చుట్టూ ఫ్యాన్ మూమెంట్ కోసం ఎదురు చూసేవాళ్లు చేరినట్టుగా ఉన్నారు. ఫ్యాన్ మూమెంట్ అంటే ఇదేదో వైసీపీ సింబల్ వ్యవహారం అనుకునేరు. అది కాదు. *చంద్రబాబు ఫ్యాన్స్  చేరిపోయి - మన బాస్ ఇప్పుడు మహా ఊపులో ఉన్నాడు అనే కిక్కులో పడి కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నారు. పొరపాటు. ఇప్పటికీ ఎన్నికల ముందు *ఉన్న మూడ్ కంటిన్యూ  అయిపోతే మూడో పార్టీ లాభపడుతుంది జాగ్రత్త. ఎందుకంటే దెబ్బ తినాల్సిన టీడీపీ తింది. టీడీపీ వైఫల్యాలతో అనూహ్యంగా లాభపడిన వైసీపీకి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక అడ్వాంటేజ్ మూడో పక్కకి పోకుండా చూసుకోవాలి. పీపీఏల *రద్దులు, పోలవరం రద్దులు లాంటివి జనంలోకి ఎలాగూ వెళుతున్నాయ్. పార్టీ తరపున వాటిని ప్రస్తావిస్తూనే నిలదీస్తూనే ఉంటారు. ప్రస్తుతానికి *కావాల్సింది జనం తరపున మాట్లాడ్డం. ఫైట్ చేయడం. అది కూడా వీలైతేనే. లేదంటే కాస్త రెస్టు మోడ్ లోకి వెళ్లి చంద్రబాబు* *హైద్రాబాద్ లో ఉన్నట్టు ఉండటమే మేలు. అంతే* *తప్ప ఇలా విరుచుకుపడి విర్రవీగితే కనీస సానుభూతి కూడా కరువు అవుతుంది. జాగ్రత్త.*