జెర్సీ' రీమేక్.. రూ.40 కోట్లు అడిగిన హీరో
ముంబయి: తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ సినిమాను రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్ భావిస్తున్నారట. అయితే 'కబీర్ సింగ్' విజయంతో జోరు మీదున్న షాహిద్ 'జెర్సీ' రీమేక్‌లో నటించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. షాహిద్ ఇందుకు అర్హుడేనని భావించిన కరణ్ కూడా ఆయన అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌లో తెలుగు సినిమా రీమేక్‌లకు ఆదరణ రోజురోజుకీ పెరిగిపోతోంది. 'అర్జున్‌రెడ్డి'కి రీమేక్‌గా వచ్చిన 'కబీర్ సింగ్' దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరోపక్క విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమాను రీమేక్ చేస్తానని కరణ్ జోహార్ ప్రకటించారు. ఇప్పుడు 'జెర్సీ', 'ఓ బేబీ' సినిమాల రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.