2004లో ఖమ్మం జిల్లా, వైరా అనే ఒక పట్టణంలో సమావేశం కోసం మంద కృష్ణ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నిరుపేద ముస్లిం కుటుంబం మంద కృష్ణ దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్ల వాడికి గుండె కి సంబందించిన రోగం ఉంది, సహాయం చేయమని కోరగా,ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం అని, ఆ మరుసటి వారమే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి ఆ కుటుంబాన్ని తీసుకెళ్ళారు మంద కృష్ణ.
25,000మాత్రమే ఇవ్వగలను అని రాజశేఖర్ రెడ్డి అంటే, కాదు లక్షన్నర ఇవ్వాల్సిందే అని మందకృష్ణ పట్టుబట్టారు.
ఆలా ఇస్తే రాష్ట్రం లో ఉన్న గుండెజబ్బు వాళ్ళందరూ ప్రభుత్వాన్ని అడుగుతారు, అందరికి ఎక్కడ నుండి చేయించాలి??డబ్బులు ఇవ్వకపోతే ఎం చేస్తావ్ అని దురుసు గా మాట్లాడాడు రాజశేఖర్ రెడ్డి , "గుండెజబ్బుల వాళ్ళ కోసం ఉద్యమం చేస్తా" అని మంద కృష్ణ బదులిచ్చి అక్కడ నుండి వెళ్లిపోయారు.
మూడు నెలలు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అంతా తిరిగి మందకృష్ణ గుండెజబ్బులు ఉన్న పిల్లలు అందరి సమాచారాన్ని సేకరించి హైదరాబాద్ లో అప్పటి తెరాస కు చెందిన ఆరోగ్య శాఖ మంత్రిని,డాక్టర్లను,మేధావులను అందరిని సమీకరించారు, సమావేశానికి వస్తూ శోభన్ అనే గుండెజబ్బు ఉన్న పిల్ల వాడు మార్గo మధ్యలోనే కన్ను మూసాడు.
ఆ శవాన్ని పట్టుకుని ట్యాంకుబండ్ మీద వేలాది మందితో ఆందోళన చేశారు మంద కృష్ణ,
అప్పటికీ రాజశేఖర్ రెడ్డి మందకృష్ణని భయపెట్టే ప్రయత్నం చేశారు..అయినా పట్టు వదలకుండా మంద కృష్ణ ఆందోళన కొనసాగించారు.
అప్పుడు రాజశేఖర్ రెడ్డి దిగి వచ్చి ఆ రోజు అక్కడ ఉన్న వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్లందరికీ వైద్యం చేయిస్తాను, ఒక పధకం తెస్తాను అని చెప్పి ప్రకటించారు.
ఆ పథకమే "ఆరోగ్య శ్రీ"
వైఎస్సార్ పార్టీ వారు మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్య శ్రీ తెచ్చారు, అందుకే ఇవాళ పేదలందరికీ ఉచిత వైద్యం అందుతుంది అని మీరు అంటున్నారే, అందులో కొద్దిగా కూడా నిజం లేదని మీరు తెలుసుకోండి.