ఏసీబీ కి చిక్కిన దేవాదాయ శాఖ అధికారి

 


దేవాదాయ శాఖ అధికారి ACB వలలో చిక్కిన  


AEO రామ్ ప్రసాద్ 


గుడిని గుళ్లో దేవుణ్ణి  మింగేస్తాడు అనే మాట వింటుంటాం.
 ఎందుకంటే భక్తులు దేవుడిని భక్తితో పూజించడమే కాదు తమ శక్తి మేరకు దేవుడికి కానుకలు కూడా సమర్పిస్తారు.  దేవుడికి , భక్తులకు సేవలు అందించాల్సిన ఓ దేవాదాయశాఖ అధికారి దేవుడు నన్నేమి చేస్తాడులే అనుకున్నాడో ఏమో మరి ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టేసరికి చివరకు దేవుడికి కోపం వచ్చి శిక్షించాడు. అక్రమంగా దేవాదాయ శాఖకు సంబంధించిన నిధులు మింగేసిన తిమింగలం ACB వలలో చిక్కి విలవిల లాడుతున్నాడు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం , స్థానిక మండిగిరి లో నివసిస్తున్న రాంప్రసాద్ అనే దేవాదాయశాఖ అధికారి గతంలో గుంతకల్లు ( మం ) కసాపురం ఆ తరువాత మంత్రలయం ( మం ) ఉరుకుంద దేవస్థానంలో ,ఇప్పుడు గూడూరు మండలంలో 13 దేవాలయాలకు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూన్నాడు. బాధితులు పిర్యాదు మేరకు ఒకే సారి నాలుగు చోట్ల ACB అధికారులు సోదాలు నిర్వహించగా  కళ్ళు చెదిరే ఆస్తుల వివరాలు దొరికాయి. ఇవన్నీ ఆదాయానికి మించిన అక్రమ ఆస్థులుగా గుర్తించారు.
 ఆదోని లో రెండు ఇళ్లు ,
 కర్నూలు లో , ఒక ఇల్లు 
 15 లక్షల 40 వేల ఫిక్స్డ్ డిపాజిట్లు
  28 లక్షల 50 వెల ప్రామిసరి నోటులు ఆదోని , పత్తికొండ , ఆలూరు ప్రాంతాల్లో భార్య పేరుమీద 23 ఇళ్ల స్థలాల పత్రాలు.
 3 లక్షల రూపాయల నగదు.
 250 గ్రాముల బంగారు  నగలు
 2 ద్వి చక్రవాహనాలు
స్వాధీనం చేసుకున్న ACB అధికారులు.