విశాఖపట్నం: రాష్ట్ర్రంలో కొత్త పరిశ్రమలు రానున్నాయని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. సోమవారం తగరపువలసలో వార్డు వలంటీర్లకు నియామక ప్రతాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు తెలిపారు. తగరపువలస, పద్మనాభం ప్రాంతంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రామ వాలంటీర్ల సేవలకు ప్రభుత్వం సముచిత గుర్తింపునిస్తుందన్నారు. చిట్టివలస జ్యూట్ కార్మికుల బకాయి ఆఖరి పైసా కూడా అందేలా చేస్తానని చెప్పారు. సాధికారిత సాధించే విధంగా మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.