గురు పౌర్ణమి ఉత్సవాలు

విజయవాడ నగరంలో గురుపౌర్ణమి 




స్థానిక ముత్యాలంపాడు నందు వెలసియున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరము నందు గురు పూర్ణిమ మహోత్సవములు అత్యంత వైభవంగా జరిగినవి. ఉదయం 5 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనము, మహా మండపారాధన, కలశ ఆహ్వానము తదుపరి బాబా వారికి సహస్ర కలశ పంచామృత స్నపన జరిగినది. మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి. గౌతమ్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ప్రారంభించినారు. 1500 ఇత్తడి కలశములతో బాబా వారికి పంచామృతాభిషేకము జరిగినది. ఈ అభిషేక కార్యక్రమంలో లో భక్తులు వేలాదిగా పాల్గొనినారు, తదుపరి శ్రీ సాయినాథ, శ్రీ దత్తాత్రేయ, హవనము జరిగినది.
శ్రీ కుంచనపల్లి రవిశంకర్ గారి దంపతులచే సుమారు 10,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది.
పై కార్యక్రమములు మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి. గౌతమ్ రెడ్డి గారి పర్యవేక్షణలో నిర్వహించబడినవి.