పంచాయతీ కార్యదర్శి అవినీతి పై విచారణ జరపాలి

 దివిపాళెం గ్రామ పంచాయతీ కార్యదర్శి అవినీతి పై విచారణ జరిపించాలి...


దివిపాళెంగ్రామ కార్యదర్శిని తక్షణమే బదిలీ చేయాలి..


గూడూరు మండలపరిషత్ కార్యాలయం ఎదుట దివిపాళెం గ్రామపంచాయతీ ప్రజల నిరసన


               ఏకపక్షంగా వ్యవహరిస్తూ,అవినీతి ఆరోపణలు ఎదుర్కొనుచున్న దివిపాళెం గ్రామ పంచాయతీ కార్యదర్శిపై విచారణ జరిపి తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్  చేస్తూ  గూడూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట  నిరసన కార్యక్రమం నిర్వహించారు.      అనంతరం ఎంపీడీఓ ను కలసి వినతిపత్రం ద్వారా ఫిర్యాదు చేశారు..దివిపాళెం  పంచాయతీలోని   వివిధ గ్రామాల ప్రజల ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.  నెల్లూరుజిల్లా గూడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి గారికి,           గూడూరు మండలం,దివిపాళెం గ్రామపంచాయతీ                                 ప్రస్తుతం దివిపాళెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా  విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి గత ఎంతోకాలంగా  పంచాయతీకి ఇంచార్జ్ మరియు రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమె గారు అధికారపార్టీ నాయకుల  అండదండలతో అనేక అవినీతి,ఏకపక్ష కార్యకలాపాలకు పాల్పడి పంచాయతీ నిధుల దుర్వినియోగమునకు పాల్పడియున్నారన్నారు. ఒకే అభివృద్ధి పనులకు ఒకే ఎంబుక్ లు ద్వారా గూడూరు మండల పరిషత్,దివిపాళెం గ్రామపంచాయతీ నిధులను  దుర్వినియోగం చేసి ఒకే పనికి రెండు సార్లు బిల్లులు మంజూరు చేసుకుని అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.నకిలీ ఇంటి పన్నుల రసీదులు ఇచ్చి ఇంటి పన్ను వసూళ్ల లో ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రజలను మోసగించిన ఆరోపణలున్నాయన్నారు.గతంలో ఉపాధిహామీ పనులలో గూడూరు మండలంలో చోటుచేసుకున్న లక్షలాదిరూపాయలు దుర్వినియోగం వివాదములు లో కార్యదర్శి పాత్ర ఉందన్నారు.అదే విధంగా సదరు కార్యదర్శి పోటుపాళెం గ్రామ పంచాయతీ కార్యదర్శి గా మరియు దివిపాళెం గ్రామ పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కాలంలో  ఆయా పంచాయతీల వార్డు మెంబర్లు,ప్రజలు జిల్లా పంచాయతీ అధికారి గారికి చేసిన ఫిర్యాదులపై విచారణలు జరిగి ఉన్నాయన్నారు.పోటుపాళెం గ్రామ పంచాయతీకి సంబంధించి షుమారు 9లక్షల రూపాయల పంచాయతీ నిధుల దుర్వినియోగం,చనిపోయిన వారి పేర్లపై ప్రభుత్వ పెన్షన్లు డ్రా చేసుకుంటున్నట్లు విచారణ నివేదికలు ద్వారా రుజువు కాబడివున్నాయన్నారు.అయినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ద్వారా ఎటువంటి చర్యలు లేకుండా రాజకీయ పలుకుబడితో పెండింగ్ లో ఉంచుకున్నట్లు తెలిపారు. మండలకేంద్రమైన సైదాపురం పంచాయతీ కార్యదర్శిగా బదిలీ చేయించుకుని అక్కడ కొంతకాలం పనిచేసి మరుగుదొడ్ల నిధుల  కుంభకోణంలో 6లక్షల రూపాయల మేరకు ప్రభుత్వదనాన్ని దుర్వినియోగం చేసినట్లు విచారణ లో వెల్లడై ఉన్నట్లు పేర్కొన్నారు.దివిపాళెం గ్రామపంచాయతీలో కూడా ఈ కార్యదర్శి హయాంలో మరుగుదొడ్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు.ఇన్ని ఆరోపణల నేపధ్యంలో టీడీపీ అధికారపార్టీ నాయకుల అండదండలతో పలుకుబడి ఉపయోగించికుని మళ్లీ దివిపాళెం గ్రామపంచాయతీ కార్యదర్శిగా బదిలీ చేయించుకుని తిరిగి గూడూరు మండలము కు రావడం జరిగిందన్నారు.గత ప్రభుత్వం నుండి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా మహిళ అనే అవకాశాన్ని అడ్డుపెట్టుకుని  ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గౌరవ న్యాయస్థానములను మోసగించువిధంగా అనేక నకిలీ ఆస్తివిలువ సర్టిఫికేట్లు జారీ చేసియున్న ఆరోపణలు  ఉన్నాయన్నారు.దివిపాళెం గ్రామ పంచాయతీలో ఎప్పుడో చనిపోయిన వ్యక్తుల పేర్లు మీద ఇప్పటికీ పింఛన్లు డ్రా చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు.ఇటీవల పంచాయతీ ఓటర్ల జాబితా రూపొందించడంలో కూడా ఏకపక్షంగా,నిర్లక్షయంగా వ్యవహరించి వార్డుల విభజన,కులాల గుర్తింపు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడడంతో అన్ని రాజకీయపార్టీల వారు అఖిలపక్షం గా ఎన్నికల కమీషన్,జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసి వున్నట్లు తెలిపారు..జిల్లా పంచాయతీ కార్యాలయంలో దశాబ్దాల కాలంగా తిష్టవేసి,జిల్లా పంచాయతీ వ్యవస్థలో  కార్యదర్శికి మద్దతుగా కొందరు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.                    ఇన్ని అవినీతి ఆరోపణలున్న  దివిపాళెం గ్రామపంచాయతీ కార్యదర్శి పై తగిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.జిల్లా పంచాయతీ,డివిజనల్ పంచాయతీ కార్యాలయాల లో కార్యదర్శి పై ఉన్న నివేధికలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సదరు *అవినీతి గ్రామకార్యదర్శిని విధుల నుంచి బదిలీ చేసి మంచి అధికారిని కార్యదర్శిగా నియమించవలసిందిగా కోరారు*. *లేని పక్షం లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తమ గోడు చేరే వరకూ త్వరలో రిలే నిరాహారదీక్ష లు చేపడతామని తెలిపారు.