నూతన గవర్నర్‌తో విజయసాయిరెడ్డి భేటీ..
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందర్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. విశ్వభూషణ్ నివాసానికెళ్లిన ఆయన గవర్నర్‌గా నియమితులైనందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు.