రాయలసీమలో కరువు - రెయిన్ గన్ల పేరుతొ బాబు దోపిడీ

రాయలసీమలో కరువు - రెయిన్ గన్ల పేరుతొ బాబు దోపిడీ - జీవోలే సాక్ష్యం


రెయిన్ గన్ ల పేరుతొ 500 కోట్లు దోచుకున్నాడు . Andhra Pradesh CM


ఈ రెయిన్ గన్ల భాగోతం గత ప్రభుత్వం హయాంలో ప్రారంభమయింది . కరువుని నివారించటానికాని మొత్తం 160 కోట్లు పెట్టి 1500 రెయిన్ గన్లు కొన్నారు . ఆ రెయిన్ గన్లకి నీళ్లు అందించటానికి మరో 30 కోట్లు పెట్టి 11933 ఆయిల్ ఇంజన్లు కొన్నారు . నీళ్లు ఉంటే కదా ఈ ఆయిల్ ఇంజన్లు రెయిన్ గన్లకి అందించేది , మళ్ళీ వాటికోసం మరో 100 కోట్లు ఖర్చు చేసి 2000 ట్యాంకర్లని బాడుగకు తీసుకొని గుంటూరు విజయవాడ నెల్లూరుల నుండి నీటిని సరఫరా చేసినట్లు లెక్కలు చూపెట్టారు .


ట్యాంకర్లతో నీటి తరలింపు , ఆయిల్ ఇంజన్లతో ట్యాంకర్లో ఉన్న నీటిని రెయిన్ గన్లకి వుండే డ్రిప్ సిస్టం ద్వారా పొలానికి నీళ్లు అందించి పంటను కాపాడటం , ఇదీ వరస .


ఈమొత్తం వ్యవహారానికి గత సవత్సరమయిన ఖర్చు అక్షరాలా 290 కోట్లు .


మళ్ళీ అదే రెయిన్ గన్ల నిర్వహణ ఖర్చులు పేరుతొ 103 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు . దానిలో వివరాలు చూడండి . ఈ నిర్వహణ కట్టబెట్టింది మరెవరకో కాదు తెలెంగాణా అప్పటి టీడీపీ నాయుకుడు రేవంత్ రెడ్డికి చెందిన కంపెనీకి . మొత్తం పదిరోజులలో పది లక్షల ఎకరాలు తడపటానికి రోజుకి 10 కోట్లు చొప్పున మొత్తం 103 కోట్లు అంజనీ పైప్స్ అనే రేవంత్రెడ్డి కంపెనీకి కట్టబెట్టారు .


రెయిన్ గన్ల కొనుగోలుకు విడుదల చేసిన GO.RT.No:86 లో వాటి ఆపరేషన్స్ & మైంటెనెన్సు కు రైతుల దగ్గర నుండి యూసర్ ఛార్జ్ లు వసూలు చేయాలి అని ఉంది. అంటే ఆపరేషన్స్ & మైంటెనెన్సు ఖర్చులు రైతులు భరించారు. మల్లి ఆపరేషన్స్ & మైంటెనెన్సు కోసం 103 కోట్లు రేవంత్ రెడ్డి కంపెనీ కి GO.RT.No:19 ఇచ్చారు. ఈ జీవో గురించి మొన్న అసెంబ్లీ లో ప్రస్తావిస్తే టాపిక్ డైవర్ట్ చేసి దాన్ని పక్కదోవ పట్టించేసారు.


రెయిన్ గన్లు ప్రభుత్వానివి , ఆయిల్ ఇంజను ప్రభుత్వానివి , నీళ్లు తరలించే ట్యాంకర్లకి డబ్బు చెల్లించేది ప్రభుత్వం , కానీ రేవంత్ రెడ్డి కంపెనీ మనుషులు వచ్చి ఈ పదిరోజులు మెయింటైన్ చేస్తారంట అందుకోసం 103 కోట్లు దోచి పెట్టారు .


గత సంవత్సరం దోచుకొన్న 290 కోట్లకి అదనంగా ఈ సంవత్సరం ఈ మెయింటైన్ చేయటానికా మరో 103 కోట్లు , మళ్ళీ ట్యాంకర్ల ద్వారా నీళ్ళని తరలించటానికి మరో 100 కోట్లు కలుపుకొంటే , మొత్తం దోపిడీ ఇప్పటివరకు దగ్గరదగ్గర 500 కోట్లు . ఇది నిరంతర ప్రక్రియ .