సాయివీణ హాస్పిటల్ లో అరుదైన వ్యాధికి చికిత్స
టైప్ -1 డయాబెటిస్ అనేది సాధారణంగా చిన్నారులలో 7-13 సంవత్సరాల వయస్సు వారిలో కనిపిస్తుంది. కానీ ఒక సంవత్సరం వయస్సు వారిలో కనిపించడం చాలా అరుదు . ఇది మొత్తం వ్యాధిగ్రస్తుల్లో కేవలం 3 శాతం పేషన్ ట్ లలో మాత్రమే కనపడుతుంది . సాయి వీణ హాస్పిటల్ కు ఇటీవల ప్రవీణ్ అనే 80 రోజుల బిడ్డను అపర్మాక స్థితి లో తీసుకు వచ్చారు. ముందు మెదడువాపు అనుమానంతో పరీక్షలు నిర్వహించారు . ఈ పరీక్షల్లో షుగర్ లెవెల్ 760 పాయింట్స్ నిర్ధారించటం జరిగింది. మరీంత లోతుగా పరీక్షలు నిర్వహించిన మీదట ఇది అత్యంత అరుదయిన టైపు - 1 ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ గా గుర్తించటం జరిగింది. ఈబాబు లో సాధారణ యాంటీ బాడీస్ కన్నా చాలా ఎక్కువ ఉండటం గమనించారు. వెంటనే సాయివీణ హాస్పిటల్ డాక్టర్స్ ఇంట్రావీనస్ ఇన్సులిన్ ఇన్సూజన్ తో పరిస్థితిని అదుపు చేసి బాబును సాధారణ స్థితికి తీసుకురావడం జరిగింది. సాధారణంగా 6 నెలలు దాటిన పిలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇంత తక్కువ వయస్సున్న 80 రోజుల వయసున్న బాబుకి రావటం దీనిని సకాలంలో గుర్తించి అదుపులోకి తీసుకు రావటం చాలా సంతోషంగా ఉందని సాయివీణ హాస్పిటల్ డాక్టర్ల బృంధం డా.సునీల్ కుమార్ రెడ్డి, డా. శ్రీనివాసరెడ్డి డా. రాధిక పేర్కొన్నారు. బరువు తక్కువతో పుట్టిన నవజాత శిశువులకు వెంటిలేటర్, పుట్టగానే ఏడవని పిల్లల కొరకు అత్యాధునిక మీరాకృడిల్ తదితర వ్యైధ్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.