కొండపల్లి లో ప్రభుత్వ పాఠశాలలు ను ఆకస్మిక తనిఖి

కొండపల్లి లో ప్రభుత్వ పాఠశాలలు ను ఆకస్మిక తనిఖి చేసిన -జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ !


కొండపల్లి గ్రామపంచాయితీ పరిధిలో వున్న బాల .బాలికల ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖి నిర్వహించిన కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ . ముందుగా బాలికల పాఠశాలను పరిశీలించారు అక్కడ వున్న ప్రధాన సమస్యలను గుర్తించారు వాటిపై వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని కిందస్థాయి అధికారులకు ఆదేశించారు అక్కడ ప్రధాన సమస్యలలు వా చ్ మెన్ ను నియమించాలి స్కూల్ ప్రగణంలో శానిటేషన్ నిర్వహించాలి చెత్త ను ప్రతి రోజు తొలగించాలని మురుగుదొడ్లు పరిశుభ్రతగా వుంచాలని పంచాయితీ అధికారులకు ఆదేశించారు స్కూల్పరిశుభ్రంగా వుంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు .


బాలుర ప్రభుత్వ పాఠశాలను ను కలెక్టర్ పరిశీలించారు అక్కడ విద్యార్థులకు కావాల్సిన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీం పట్నం తాహసిల్దార్ ,డిప్యూటీ తాహసీల్దార్ . కొండపల్లి ఈవో . ఇబ్రహీం పట్నం సీఐ . ఎండివో . స్కూల్స్ సిబ్బంది రెవిన్యూ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు


అదేవిధంగా గతంలో బాడిశ నాగరాజ కుమారి అలియాస్ కౌసర్ బేగం కొండపల్లి పంచాయితీ పరిధిలోవున్న బాల ,బాలుర ప్రభుత్వ పాఠశాలలను దత్తతు తీసుకొని అభివృద్ధి పనులకు పాటుపడతానని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయటం జరిగింది అదేమాట మీద నిలబడి బాలిక హై స్కూల్ ను పరిశీలిస్తాం జరిగింది అక్కడ సమస్యలను స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లటం తదనంతరం వసంత కృష్ణప్రసాద్ ప్రభుత్వ దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయటం జరిగిందిఅని అన్నారు . స్కూల్స్ అభివృద్ధికి పూర్వవిద్యార్థులు పాటుపడతానికి సిద్ధంగా వున్నారని ఆమె పేర్కొన్నారు