Rయడియూరప్పకు అమిత్‌షా అభినందనలు
న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్ యడియూరప్పకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఓ ట్వీట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. 'కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మీకు నా అభినందనలు. మీ నాయకత్వంలో, ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో బీజేపీ స్థిరమైన, రైతు అనుకూల, అభివృద్ధి శీలక ప్రభుత్వాన్ని అందిస్తుందని నేను నిశ్చయంగా చెప్పగలను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పాలన అందిస్తుందని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నాను' అని అమిత్‌షా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.