29న కొత్త యుద్ధనౌక ‘ఎల్‌సీయూ ఎల్‌ 56’ ప్రవేశం


29న కొత్త యుద్ధనౌక 'ఎల్‌సీయూ ఎల్‌ 56' ప్రవేశం


విశాఖపట్నం: పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ యుటిలిటీ (ఎల్‌సీయూ) ఎంకే నాలుగో తరగతికి చెందిన 'ఎల్‌సీయూ ఎల్‌ 56' ఈ నెల 29న భారత నౌకాదళంలోకి రానుంది. తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌జైన్‌ నౌకను కమిషనింగ్‌ చేస్తారు. ఈ యుద్ధనౌక నేల మీద, నీటి మీద కూడా ప్రయాణిస్తుంది. దీని ప్రధాన లక్ష్యం సిబ్బందిని, ఆయుధ సంపత్తిని తరలించడం. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ దీనిని తయారుచేశారు. దీని బరువు 900 టన్నులు. పొడవు 62 మీటర్లు. రెండు డీజిల్‌ ఇంజన్లతో పనిచేస్తూ గంటకు 15 నాటికల్‌ మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో 30 ఎంఎం సీఆర్‌ఎన్‌-91 తుపాకులు రెండు ఉంటాయి. నలుగురు ఆఫీసర్లు, 56 మంది సెయిలర్లు ఉంటారు. ఇది 150 ట్రూపులను తీసుకెళుతుంది. ఇది నేవీలో ప్రవేశించాక అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని పోర్టు బ్లెయిర్‌ కేంద్రంగా సేవలు అందిస్తుంది.