ఏటా కోటి ముక్కలను పెంచడమే లక్ష్యం - పుట్టపర్తి ఎమ్మెల్యే

ఏటా కోటి ముక్కలను పెంచడమే లక్ష్యం”



దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే



ప్రతి ఏటా కోటి మొక్కల ప్రకారం ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో ఐదు కోట్ల మొక్కలు నాటి వాటిని పరిరక్షించడమే లక్ష్యంగా కృషి చేస్తామని శాసనసభ్యుడు దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి తెలిపారు.  ఎనుముల పల్లి ఉన్నత పాఠశాల నుంచి గణేష్ సర్కిల్ వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి మొక్కలు నాటడం పై నినాదాలు ఇచ్చారు. ఇందులో పాల్గొన్న దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో కార్యాలయాల యందు మొక్కలు నాటుదాం అన్నారు. పార్టీలకతీతంగా, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, అధికారులు అందరూ భాగస్వామ్య మై ఈ వన మహోత్సవం లో పాల్గొనాలని కోరారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు, జల సంరక్షణ చేసుకోవాలన్నారు. చెట్లు లేనందున ఈ ప్రాంతంలో తీవ్ర వర్షాభావంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. అయిదేళ్ల పాటు ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి కన్వీనర్లు మాధవ రెడ్డి, గంగాద్రి, ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.