నేటి యువతకి ఆదర్శం

హోటల్ క్లీనర్.. ఇప్పుడు కలెక్టర్..
షేక్ అబ్దుల్ నాసర్... IAS


అబ్దుల్ నాసర్.. కేరళలోని కొల్లం జిల్లా కలెక్టర్.. పేదరికంలో పుట్టి, ముస్లిం అనాధ శరణార్ధుల స్కూల్ లో చదివి కలెక్టర్ అయ్యాడు.. కన్నీరు తెప్పించే దయనీయ జీవిత నేపథ్యం, స్ఫూర్తిని కలిగించే జీవన ప్రయాణం నాసర్ గతం.. చిన్నప్పుడు చదువుకుంటూనే ఇళ్లలో తల్లికి తోడుగా పాచి పనులు, పదేళ్ల వయసులో రాత్రిళ్ళు హోటల్స్ లో క్లీనర్ పనులు, 15 ఏళ్ల వయసులో కూలీ పనులు, ఇంత కఠినమైన, కఠోరమైన జీవితం తల్లి పట్టుదల , ప్రోత్సాహం, ఆయనను ఐఏఎస్ చేశాయి.. చివరకు ఈ పేదవాడిని జిల్లా కలెక్టర్ చేశాయి... ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం కావాలి...