మన నీళ్లు మన నేల

మన నీళ్ళు - మన నేల


మీరు వైసీపి, మేము టీడీపీ అనేది తర్వాత. ముందు మనం ఆంధ్రులం. వైఎస్సార్, చంద్రబాబు, జగన్ ముగ్గురూ రాయలసీమ బిడ్డలే. ఇంకొంచెం ఎక్కువ నిధులతో ఆల్టర్నేటివ్స్ వెతకుదాం. మన నేలమీదనే ప్రాజెక్టులు కట్టుకుని సీమకి నీళ్ళు అందించుకుందాం. రాయలసీమకి నీళ్ళు అనే ఆశ మనకి చూపించి పక్కరాష్ట్రం పాలకులు మన కుండలో కూడు మళ్ళీ ఇంకోసారి కొట్టేయాలని చూస్తే పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు..ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, అడ్డం తిరుగుతాం. వైసీపీలో కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకొందరు నాయకులు ఇరిగేషన్ మీద విషయపరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఇన్‌వాల్వ్ చేసి రాష్ట్రానికి నష్టం జరగకుండా మన నీళ్ళు - మన నేల అనే పద్ధతిలోనే వ్యవహరించండి.  మన సీమకి మనం నీళ్ళు తెచ్చుకుంటాం. మన సొమ్ముతో  పక్కరాష్ట్రం సిఎం సోకు చేసేది, మనకేదొ దయతలచి  నీళ్ళు ఇచ్చేది ఏంది.