ఏపీ చీఫ్ విఫ్ ఎదుటే వెలుగు యానిమెటర్ ఆత్మహత్య యత్నం

ఏపీ చీఫ్ విఫ్ ఎదుటే వెలుగు యానిమెటర్ ఆత్మహత్య యత్నం..


అడ్డుకున్న చీఫ్ విఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి..


లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు గ్రామ పంచాయతీకి పెద్దపల్లె హరిజనవాడకు చెందిన వెలుగు యానిమేటర్ ఓబులేశు అనే వ్యక్తి ఆదివారం ప్రభుత్వ ఛీప్ విఫ్, స్ధానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎదుట సూపర్ వాసుమోల్ త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్న సంఘటన లక్కిరెడ్డిపల్లె మండల సభ భవనంలో జరిగిన మండల సమావేశంలో చోటుచేసుకుంది. వివరాలల్లోకి వెళ్తే గత ఐదు సంవత్సరాల నుంచి వెలుగు కార్యలయంలో యానిమెటర్ గా పని చేస్తున్న ఓబులేశు ను రెండు రోజుల క్రితం ఏపీఎం శ్రీనివాసులురెడ్డి నిన్ను విధులను నుండి తొలగిస్తున్నామని నీవు సోమవారం నుంచి విధులకు హాజరు కావద్దని చెప్పడంతో ఓబులేశు మనస్తాపం చెంది ఆదివారం జరిగిన మండల సమావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.