నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సమావేశాన్ని ప్రారంభించిన నేతలు...
సోమిరెడ్డి కామెంట్స్
ఓడిపోయినప్పుడు జరిగింది జరిగిపోయిందనకుంటూ వదిలేస్తే మళ్లీ అధికారంలోకి వచ్చాక తప్పులు చేసే పరిస్థితి వస్తే... ఎప్పుడు పార్టీ పదికాలాల పాటు అధికారంలో కొనసాగుతోంది..అనే విషయం అధినాయకత్వం కూడా విశ్లేషించుకోవాలి..
నాయకులు, కార్యకర్తలు ఎంత వెన్నువెరిచి పనిచేసినా అంతిమంగా విజయం ఇరు పార్టీల అధినేతలు, వారు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడివుంటుంది..
ఓటమికి కారణాలను నిష్పక్షపాతంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అసవరం ఉంది...
2004లో ఉద్యోగులు వ్యతిరేకమయ్యారు..2014కి న్యూట్రల్ గా ఉన్నారు..2019కి మళ్లీ పూర్తిగా వ్యతిరేకమయ్యారు..
ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్, ఐఆర్ తో పాటు వారు అదనపు ప్రయోజనాలు ఇచ్చి ఎందుకు వారి అభిమానం పొందలేకపోయాం...
చరిత్రలో లేని విధంగా పథకాలు అమలు చేసినా ఏ వర్గం అభిమానం ఎందుకు పొందలేకపోయాం..
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం..కానీ మొదటిసారి 10.7 శాతం ఓట్లతో ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించుకోవాలి...
వైకాపాకు ప్రజలు 151 సీట్లతో ఎదురులేని విధంగా అధికారం ఇచ్చారు..వాళ్లు ఇంకా ఏమి ఆశిస్తున్నారో అర్ధం కావడం లేదు..
అమరావతిలో ప్రజావేదిక కూలగొట్టారు...చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చారు..
గ్రామ స్థాయిలో కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు కక్షసాధింపు చర్యలకు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారు..గతంలో ఎన్నడూలేని విధంగా పరిస్థితులు నెలకొన్నాయి...
గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవు..
గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిలో అనేక మంది అప్పుడే బాధపడే పరిస్థితులు వచ్చాయి.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని, ఇంకా ఎన్నో పథకాలు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు భావించారు..కానీ ప్రజలు అవి కోరుకోలేదు...
అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే నాలుగైదు పథకాలపై దృష్టి కేంద్రీకరించివుంటే ఫలితం మరోలా ఉండేది..కొత్తకొత్త పథకాలంటూ ముందుకుపోయి అధికారం కోల్పోయాం...
రుణమాఫీని సంపూర్ణం చేయలేకపోయాం...అర్బన్ హౌసింగ్ లో షేర్ వార్ టెక్నాలజీ అంటూ వేలాది కోట్లతో ఇళ్లు నిర్మించినా గృహ ప్రవేశాలు చేయించలేకపోయాం..
అభివృద్ధిపై దృష్టి పెట్టాం కానీ రాజకీయ ఎత్తుగడలు, పోల్ మేనేజ్మెంట్ లోనూ విజయవంతం కాలేకపోయాం...
వైకాపాకు కేసీఆర్, మోదీ పూర్తి స్థాయిలో అండగా నిలిచారు..అవసరానికి మించి సాయం అందించారు..
క్షేత్రస్థాయిలో ఎవరూ ఇబ్బంది పడకూడదని ప్రతి కేబినెట్ సమావేశంలో నీరు-చెట్టు బిల్లులు, రుణమాఫీ తదితర అంశాలను ప్రస్తావించేవాళ్లం...
నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో విజయం కోసం ప్రాణాలకు తెగించి పనిచేశారు..
ప్రతి గ్రామంలో అత్యధిక మెజార్టీ సాధించే లక్ష్యంతో 14 ఫైనాన్స్, ఎన్ఆర్జీఎస్, నీరు-చెట్టు పథకాల్లో అనేక పనులు మంజూరు చేయించుకున్నారు..
నీటిపారుదల వ్యవస్థను సమూలంగా మార్చేందుకు చేపట్టిన నీరు-చెట్టు పనులను చేసినోళ్లు తీవ్రంగా నష్టపోయారు..
రైతుల కోసం షెడ్యూల్ రేటు కంటే 15 శాతం తగ్గించిన రేట్లతో నీటి సంఘాల ప్రతినిధులు పనులు చేపట్టి అప్పులు పాలయ్యారు...
నీరు-చెట్టులో అవినీతి జరిగిందంటూ బిల్లులు చెల్లించబోమంటున్నారు...ఆ పథకంలో చేసిన పనులు, నిర్మాణాలను ధ్వంసం చేసేయగలరా...
జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్సులో మొదటి రోజు తమ ఎమ్మెల్యేలు తప్పు చేసినా నిలదీయమని అధికారులకు చెప్పారు...రెండో రోజూ మాత్రం ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయమని ఆదేశించారు...
వైకాపా ఎమ్మెల్యేలు, వారి వెనుక ఉండే నాయకులు వినియోగిస్తున్న భాషను గతంలో ఎన్నడూ టీడీపీ నేతలు మాట్లాడివుండరు..
ప్రధానంగా పోలీసు శాఖపై ఒత్తిడి పెంచుతున్నారు..ఆ ప్రభావం టీడీపీ కార్యకర్తలపై పడుతోంది..
పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను 18 వేల కోట్ల నుంచి 56 వేల కోట్లకు పెంచేశామని అసెంబ్లీలో గగ్గోలు పెట్టారు..
ఇది జరిగిన రెండు రోజులకే పునరావాసం ప్యాకేజీ 36 వేల కోట్లతో కలిపి టీడీపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదలను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర జలవనరుల శాఖ అన్ని న్యాయంగా ఉన్నాయని ఆమోదించింది...
నిబంధనలకు అనుగుణంగా క్రిష్ణా నదికి 100 మీటర్లకు పైగా దూరంలో నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టారు..కరకట్ట మీద నిర్మాణాలు జరిగిదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే...
2004కి ముందు హైదరాబాద్ బంజారా హిల్స్ లో ప్రభుత్వ స్థలంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇల్లు కట్టుకున్నారు...అధికారంలోకి రాగానే క్రమబద్ధీకరించుకుని కమర్షియల్ బిల్డింగ్ లు నిర్మించుకున్నారు...
టీడీపీకి అధికారం ఉన్నప్పుడు చీమకు కూడా హానితలపెట్టే పనులు చేయలేదు..
ప్రజలు వైకాపాకు అధికారం ఇచ్చింది ప్రజావేదిక కూలగొట్టడానికి, చంద్రబాబును ఇల్లు ఖాళీ చేయించడానికి కాదు...ప్రజాభిమానం చూరగొనే పనులు చేయండి..
సోమశిల పరిధిలో పెండింగ్ అటవీ అనుమతులు తెచ్చాం...నెల్లూరు బ్యారేజీని దాదాపు పూర్తి చేశాం...సంగం బ్యారేజీ డిజైన్ల అనుమతుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది...ఇవన్నీ మీరు పూర్తి చేయండి...దగదర్తి ఎయిర్ పోర్టు, జువ్వలదిన్నె పిష్పింగ్ హార్బర్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం...అన్ని పూర్తి చేయండి...
దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు, వారి ఆస్తుల జోలికిరావద్దు..మీరు మితిమీరితే మా కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు..
క్షేత్ర స్థాయిలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తున్న కార్యకర్తలకు జీవితాంతం రుణపడివుంటాం...