పాలకమండళ్లు రద్దు

ఏపీలో 13 యూనివర్శిటీల పాలక మండళ్లు రద్దు


అమరావతి:రాష్ట్రంలోని 13 యూనివర్శిటీల పాలక మండళ్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, కడపలోని యోగివేమన, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, గుంటూరులోని ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం, నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలతో పాటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్టీయూ పాలక మండళ్లను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.